చిరంజీవికి సహాయ మంత్రి? స్వతంత్ర హోదాలో ఛాన్స్?

రాష్ట్ర కేబినెట్లోనూ చిరంజీవి వర్గం ఎమ్మెల్యేలకు సరైన ప్రాధాన్యం సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని కిరణ్ కూడా యోచిస్తున్నారట. అదే విషయాన్ని అధిష్టానానికి చెప్పినట్లుగా సమాచారం. ఇటీవల ఖాళీ అయిన మంత్రి పదవులను చిరు వర్గంతో భర్తీ చేయాలని చూస్తున్నారట. అయితే మంత్రివర్గ విస్తరణ విషయంలో మాత్రం అధిష్టానం సిఎంకు మరోసారి మొండిచేయి చూపినట్లుగా తెలుస్తోంది. చిరు సోమ, మంగళ వారాల్లో ఢిల్లీ వెళుతున్నారు. ఈ పర్యటనలో చిరు పదవి దాదాపు ఖరారు కావచ్చని చాలామంది అభిప్రాయపడుతున్నారు. చిరుతో పాటు శనివారం కేంద్రానికి మద్దతు ప్రకటించిన ఆర్ఎల్డీ నేత అజిత్ సింగ్, టిఎంసికి చెందిన మరో ఎంపికి కూడా సాధ్యమైనంత త్వరలో కేంద్ర పదవులు కట్టబెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications