జగన్‌కు యనమల సవాల్, మీడియా భయమని ఎద్దేవా

yanamala ramakrishnudu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సోమవారం సవాల్ విసిరారు. జగన్ ఆస్తులపై మేం చేసిన ఆరోపణలకు ఆధారాలతో సహా నిరూపించామని, వైయస్సార్ కాంగ్రెసు కూడా మా అధినేత చంద్రబాబుపై చేసే ఆరోపణలకు సాక్ష్యాధారాలు చూపించగలదా? అని ప్రశ్నించారు. జగన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే తన సవాల్ స్వీకరించాలన్నారు. తన మీడియాను ఉపయోగించుకొని జగన్ చంద్రబాబు, టిడిపిపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.

బాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలపై ఆయన మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. న్యాయవ్యవస్థపైనే ఆయన బురద జల్లడం విడ్డూరమన్నారు. మీడియా ముందుకు రావడానికే భయపడే నేత జగన్ అని విమర్శించారు. జగన్ అక్రమ ఆస్తులు డాక్యుమెంట్లతో సహా మేం చూపించామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+