చంద్రబాబుపై గుడ్లు, టమాటాలు: టిఆర్ఎస్ వర్సెస్ టిడిపి

chandrababu naidu
అదిలాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌ని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు గురువారం అదిలాబాద్ జిల్లాలో అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది. రైతు పోరుయాత్రలో భాగంగా వెళుతున్న చంద్రబాబు కాన్వాయ్‌ను పలువురు టిఆర్ఎస్ కార్యకర్తలు ఇచ్చోడ బైపాస్ రోడ్డు వద్ద అడ్డుకొని, గుడ్లను విసిరారు. పోలీసులు, టిడిపి కార్యకర్తలు వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. ఆందోళనకారులు వెనక్కి తగ్గక పోవడంతో టిడిపి, టిఆర్ఎస్ మధ్య వాగ్యుద్దం చోటు చేసుకుంది. వాగ్యుద్ధం కాస్త ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఇద్దరు టిఆర్ఎస్ కార్యకర్తలు గాయపడ్డారు.

పరిస్థితి ఉద్రిక్తంగా రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. నలుగురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. లాఠీఛార్జ్‌ని నిరసిస్తూ పలువురు తెలంగాణవాదులు పోలీసు స్టేషన్ వద్ద బైఠాయించారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ మండలం మామిడిపల్లి చౌరస్తాలోనూ పలువురు మహిళలు బాబు కాన్వాయ్‌పై గుడ్లు, టమాటాలు విసిరారు. కాగా నిజామాబాద్ జిల్లాలో చంద్రబాబు పర్యటన సందర్భంగా పలువురు జెఏసి కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. పలు గ్రామాల్లో భారీగా పోలీసులను మోహరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+