ఉప ఎన్నికల్లో తెలుగుదేశం ట్రంప్ కార్డు బాలయ్య

రాష్ట్రంలోని దాదాపు 26 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఇది మినీ సాధారణ ఎన్నికల సమరాన్ని తలపించే అవకాశాలున్నాయి. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలను తీవ్రంగా దెబ్బ తీయాలనే ఉద్దేశంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఉన్నారు. దీంతో ఈ రెండు పార్టీలను దెబ్బ తీస్తూ కాంగ్రెసు పార్టీని ఎదుర్కోవడానికి బాలకృష్ణ ప్రచారం అవసరమని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
బాలకృష్ణ ప్రకాశం, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లోని శాసనసభ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. తెలంగాణలో బాలకృష్ణ ప్రచారం ఉంటుందా, లేదా అనేది తెలియదు. సీమాంధ్రలో మాత్రం బాలయ్యను పార్టీ ప్రచారం కోసం విస్తృతంగా వాడుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారు.












Click it and Unblock the Notifications