జైలు నుంచే గాలి సాక్షులను బెదిరిస్తున్నారు: సిబిఐ

CBI logo
హైదరాబాద్: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సాక్షులను బెదిరిస్తున్నారని, ఇందుకు తగిన ఆధారాలున్నాయని సిబిఐ ఆరోపించింది. తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గాలి జనార్దన్ రెడ్డి, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ దాఖలు కోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సిబిఐ శుక్రవారం కౌంటర్ దాఖలు చేసింది. గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటక మాజీ మంత్రి కావడంతో అక్కడి సాక్షులను బెదిరిస్తున్నారని, అందువల్ల వారికి బెయిల్ మంజూరు చేయవద్దని సిబిఐ అన్నది. గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఓ ఉన్నతాధికారిని ఐదుగురు వ్యక్తులు బెదిరించినట్లు ఆధారాలున్నాయని సిబిఐ చెప్పింది. సాక్షులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపింది.

ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మికి మాదిరిగా తమకు బెయిల్ మంజూరు చేయాలని వీరిద్దరు కోరడం అర్థరహితమని సిబిఐ వాదించింది. కేసులో వీరిద్దరు కీలకమైన నిందితులని, శ్రీలక్ష్మి చేసిన తప్పు వేరని చెప్పింది. శ్రీలక్ష్మి చేసిన తప్పు వల్ల వీరిద్దరు లాభపడ్డారని తెలిపింది. అక్రమ మైనింగ్‌ను సక్రమంగా చూపడానికి ఒఎంసికి లీజులు పొందారని సిబిఐ ఆరోపించింది. చార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ దర్యాప్తు కొనసాగుతోందని, వీరిద్దరికి బెయిల్ ఇస్తే కేసుకు నష్టం జరుగుతుందని వాదించింది. గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి తాము సంపాదించిన డబ్బును ఎక్కడ దాచి పెట్టారో తెలియడం లేదని చెప్పింది. దీనిపై హైకోర్టు విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది.

కాగా, తన బెయిల్‌ను నిలుపుదల చేస్తూ ఇచ్చిన ఆదేశాలపై అక్రమ మైనింగ్ కేసులో నిందితుడు రాజగోపాల్ పిటిషన్ దాఖలు చేశారు. రాజగోపాల్‌కు సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ సిబిఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిది. రాజగోపాల్‌కు బెయిల్ ఇస్తూ సిబిఐ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈ నెల 19వ తేదీ వరకు నిలుపుదల చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాజా పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో కర్నూలు జిల్లా గనుల శాఖ ఎడి హాజరయ్యారు.

ఇదిలా వుంటే, ఎమ్మార్ కేసులో సిబిఐ ముందు ఎమ్మార్ టౌన్ హిల్స్ ప్రతినిధులు హాజరయ్యారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో వాన్‌పిక్ ప్రతినిధులు, ఎల్ అండ్ టి, ఆర్ఆర్ స్టోన్స్ ప్రతినిధులు సిబిఐ ఎదుట హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+