చంద్రబాబు, కిరణ్ కుమార్ తోడు దొంగలు: కోదండరామ్

ఉప ఎన్నికలు కూడా తెలంగాణ ఉద్యమంలో భాగమేనని, తెలంగాణ కోసం రాజీనామా చేసిన నాయకులకు తమ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. కాంగ్రెసును లక్ష్యంగా చేసుకుని తాము ఉద్యమాన్ని సాగిస్తామని ఆయన అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను మట్టి కరిపిస్తామని ఆయన అన్నారు. కాంగ్రెసు కుట్ర వల్లనే తెలంగాణపై చర్చ చేయకుండా రాజ్యసభ వాయిదా పడే పరిస్థితి వచ్చిందని ఆయన విమర్శించారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నాయకులను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications