దీన్ని వదలొద్దు: మద్యం సిండికేట్‌పై నేతలతో బాబు

కాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ రాష్ట్రంలోని మద్యం సిండికేట్ మాఫియాకు సంబంధించి అసలు గుట్టు బయటపడాలంటే సిబిఐచే దర్యాఫ్తు చేయించాలని డిమాండ్ చేశారు. మద్యం సిండికేట్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలని కోరారు. మంత్రులు, ఎమ్మెల్యేల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పార్టీ తరఫున ప్రజా ఉద్యమం చేపడతామని అప్పటికీ స్పందించకుంటే సిఎం కిరణ్ కుమార్ రెడ్డి నివాసం ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఉప ఎన్నికల కోసం ముందస్తుగా భారీగా ఖర్చు పెడుతోందన్నారు.'












Click it and Unblock the Notifications