టిడిపి నేత దారుణహత్య: అక్రమ తరలింపు అడ్డుకోవడమే

వాహనంలోని ఉన్న డ్రైవర్లు, చిట్టిబాబుకు మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. గొడవ చినికి చినికి వాన అయింది. డ్రైవర్లు చిట్టిబాబును ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా కొట్టారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆగ్రహం చెందిన గ్రామస్థులు కాకిరాయి ఐరన్ ఓర్ క్వారీపై దాడి చేశారు. ఫర్నీచర్‌కు నిప్పు పెట్టారు. జనరేటర్‌ను ధ్వంసం చేశారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
మరోవైపు మెదక్ జిల్లా చిన్న శంకరంపేట సమీపంలోని కాస్లాపూర్ వద్ద తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఎదురెదురుగా వస్తున్న ట్రాక్టర్, లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడమే మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.












Click it and Unblock the Notifications