వీణా మాలిక్ దొరికిందోచ్!: ముంబయి హోటల్లో ప్రత్యక్షం

వీణా మేనేజర్ ప్రతీక్ మెహ్తా ఉదయం ఓ జాతీయ పత్రికతో మాట్లాడుతూ ఓక్ వుడ్ హోటల్లో ఉన్న వీణా మాలిక్‌తో తాను మాట్లాడానని చెప్పారు. ఈమె అదృశ్యం పబ్లిసిటీ స్టంట్ కోసమే అన్న వారు కూడా ఉన్నారు. కాగా రెండు రోజుల క్రితం వీణా మాలిక్ షుటింగ్ స్పాట్ నుండి అదృశ్యమైన విషయం తెలిసిందే. ముంబయికి 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ప్రాంతంలో పదిహేను రోజులుగా షూటింగులో పాల్గొన్నది. ఇటీవల ఓ మేగాజైన్‌లో న్యూడ్‌గా కనిపించి ఆమె సంచలనం సృష్టించారు. అప్పటి నుండి ఆమె పత్రికల్లో పతాక శీర్షికలకెక్కారు.












Click it and Unblock the Notifications