వైయస్ జగన్‌కు తెలంగాణ ఎంట్రీ: టిడిపి గేమ్ ప్లాన్

వైయస్ జగన్‌ను అడ్డుకోబోమని చెప్పడం ద్వారా తెలుగుదేశం నాయకులు తమ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని తెలంగాణవాదులు అడ్డుకోకుండా చూడాలనే వైఖరితో పనిచేస్తున్నారని అంటున్నారు. తెలంగాణపై చంద్రబాబు వైఖరినే వైయస్ జగన్ అనుసరిస్తున్నారు. అందువల్ల జగన్‌ను అడ్డుకోనప్పుడు తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కూడా అడ్డుకోకూడదనే భావన రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రకటనలో ఉందని అంటున్నారు. తెలంగాణ కోసం పోరాడండని చంద్రబాబు ఇటీవల వరంగల్లు జిల్లా పరకాల పార్టీ నాయకులకు ఉపదేశించారు కూడా. తెలంగాణ కోసం పోరాడాలని చెబుతూ తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పుకుంటూ చంద్రబాబు తెలంగాణ ఉప ఎన్నికలను దాటడానికి ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications