తెలంగాణపై స్పష్టత ఇస్తే మద్దతు ఇస్తాం: కోదండరామ్

Kodandaram
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లాలోని ఉప ఎన్నికలలో తెలంగాణపై స్పష్టత ఇచ్చిన వారికి తాము మద్దతిస్తామని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ మంగళవారం చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చే వారందరికీ జెఏసి మద్దతు ఉంటుందన్నారు. అలాంటి వారి గెలుపు కోసం ప్రచారం చేస్తామన్నారు. స్పష్టత ఇవ్వని నేతలకు మద్దతు పలికే ప్రసక్తి లేదన్నారు. అలాంటి వారిని ప్రజలు గ్రామాల్లోకి వస్తే నిలదీస్తారని హెచ్చరించారు.

ఈ నెల 23వ తేదిన తెలంగాణపై కేంద్రం వెనక్కి తగ్గిన రోజు కాబట్టి నిరసన ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. హైదరాబాదు సుందరయ్య పార్కు నుండి ర్యాలీ చేపడతామన్నారు. ఈ సమావేశాలలో పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో పోలీసులతో పర్యటిస్తున్నారని ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+