సినిమా హిట్ కన్నా అదే ఎక్కువ ఆనందం: చిరంజీవి

Chiranjeevi
విశాఖపట్నం: తాను స్థాపించిన ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ ద్వారా అందిస్తున్న సేవలే తనకు ఎక్కువ సంతృప్తినిస్తున్నాయని మెగాస్టార్, కాంగ్రెసు నాయకుడు చిరంజీవి అన్నారు. తాను నటించిన సినిమా హిట్ అయినప్పటి కన్నా తాను స్థాపించిన ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ లబ్ధిదారులు తమకు అందిన సేవలపై సంతృప్తి వ్యక్తం చేసినప్పుడే ఎక్కువ ఆనందం కలుగుతుందని ఆయన అన్నారు. విశాఖపట్నంలో చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ రజత్సోవ వేడుకల్లో ఆయన బుధవారం పాల్గొని ప్రసంగించారు. అసెంబ్లీ సమావేశాల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. శాసనసభ వేదికగా రైతు సమస్య పరిష్కారం కోసం ఆలోచన చేయకుండా పరస్పరం బురద చల్లుకున్నారని ఆయన విమర్శించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ రాజకీయ నాయకుడు భాట్టం శ్రీరామమూర్తి, పలువురు కాంగ్రెసు, ప్రజారాజ్యం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైతన్యస్రవంతి సంస్థకు చెందిన మహిళలు మద్యం మహమ్మారిపై ప్రదర్శించిన లఘు నాటికలు ప్రేక్షకులను అలరించాయి. అంతకు ముందు విశాఖపట్నం చేరుకున్న చిరంజీవి రాజకీయాలపై మాట్లాడడానికి నిరాకరించారు. విశాఖపట్నంలో తనకు ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోందని ఆయన చెప్పుకున్నారు. తనకు ఎప్పుడూ విశాఖపట్నం ఇలాంటి ఆదరణనే ఇస్తుందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+