చిరంజీవికి రాజ్యసభ సీటు, దాసరికి మొండిచేయి?

ప్రస్తుత రాజకీయాల తీరు పట్ల దాసరి నారాయణ రావు వైరాగ్యం కూడా ప్రదర్శించారు. రాజ్యసభ సభ్యుడిగా దాసరి నారాయణ రావు పదవీ కాలం వచ్చే ఏడాది ఏప్రిల్ 2వ తేదీతో ముగుస్తుంది. రాష్ట్రం నుంచి ఆరు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. వీరి స్థానంలో కాంగ్రెసు నుంచి నలుగురు రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం ఉంది. దీంతో దాసరి నారాయణ రావు స్థానంలో చిరంజీవిని రాజ్యసభకు పంపించాలనే యోచనలో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. జనవరి లేదా ఫిబ్రవరిలో చిరంజీవిని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications