కెసిఆర్! ఉరేసుకుంటావా, రా!!: తాడుతో మోత్కుపల్లి

తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కెసిఆర్ మాటలు చెబుతున్నారని ఆయన అన్నారు. ఉరేసుకోవడానికి తాను తాడు తెచ్చానని, దమ్ముంటే కెసిఆర్ ముందుకు రావాలని ఆయన అన్నారు. ఢిల్లీలో చేసుకున్న ఒప్పందాలేమిటో కెసిఆర్ వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ పదవుల కోసం కెసిఆర్ ఢిల్లీలో ఒప్పందాలు చేసుకున్నారు. ఉద్యమం పెద్ద యెత్తున జరుగుతున్న సమయంలో కెసిఆర్ ఎవరూ పిలవకుండానే ఢిల్లీకి వెళ్లి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిశారని, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో రహస్య అవగాహనకు వచ్చారని, సమ్మె విరమించడానికి పోలవరం టెండర్లను దక్కించుకున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ వచ్చుడో కెసిఆర్ చచ్చుడో అని చెప్పారని, తల తెగ నరుక్కుంటానని అన్నారని, అయితే తెలంగాణ ప్రజలను కెసిఆర్ బలి పెడుతున్నారని ఆయన అన్నారు.
తెలంగాణ ఉద్యమం గోడకు వేలాడుతున్న తుపాకి అని తెరాస శాసనసభ్యుడు కెటి రామారావు చేసిన వ్యాఖ్యపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అది పనికి రాని తుపాకి అని ఆయన అన్నారు. కెసిఆర్ పిట్టల దొరలాగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటి నిజాం కెసిఆర్ అని, నయా నిజాం కెసిఆర్‌ను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications