మంత్రి శంకరరావుకు ఆంధ్రా అన్నా హజారే అవార్డు

P Shankar Rao
హైదరాబాద్: చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకరరావుకు ఆదివారం అరైజ్ అనే తమిళ సంఘం ఆంధ్రా అన్నా హజారే అవార్డును అందజేసింది. ఉదయం సికింద్రాబాదులోని రైల్ కళారంగ్ ఆడిటోరియంలో జరిగిన ఓ కార్యక్రమంలో వారు ఈ అవార్డును అందజేశారు. శంకరరావు మంత్రివర్గంలో ఉంటూనే మంత్రులకు, ముఖ్యమంత్రులకు కొరకురాని కొయ్యలా మారిన విషయం తెలిసిందే. తనను మంత్రివర్గం నుండి తప్పించాలని సాక్ష్యాత్తూ సిఎంనే సవాల్ చేసినా, సహచర మంత్రులపై విరుచుకు పడినా ఆయనకే చెల్లు. లేఖలు, ఫిర్యాదులు, వ్యాజ్యాలతో హల్ చల్ చేస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ నగర్‌లో తనపై దాడి జరిగినప్పుడు ఆయన హోంమంత్రిపై విరుచుకు పడ్డారు. ఆమెను తప్పించాలని డిమాండ్ చేశారు. తనకు సెక్యూరిటీ తగ్గిందని, బెదిరింపు ఫోన్స్ వస్తున్నాయని అయినప్పటికీ ప్రభుత్వం గానీ, పోలీసు అధికారులు గానీ పట్టించుకోవడం లేదని, ఫర్నిచర్ ఇవ్వలేదని అధికారులతో సహా కింద కూర్చొని విధులు నిర్వర్తించడం ఆయనకే చెల్లు.

ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం పైనే విరుచుకుపడే శంకరరావుపై చర్యల తీసుకోవాలని పలుమార్లు డిమాండ్లు వచ్చాయి. ఓ సమయంలో ఆయనను తప్పించాలనే నిర్ణయం దాదాపుగా జరిగి పోయినా దానికి బ్రేక్ పడింది. కిరణ్ మంత్రివర్గంలో అవినీతిపరులు అంటూ ఆయన అప్పుడప్పుడు మంత్రులకు ముచ్చెమటలు పోయిస్తారు. మరో విచిత్రమేమంటే ప్రతిపక్ష నేత చంద్రబాబును బాహాటంగానే కొనియాడతారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలంటారు. విపక్షాలతో సఖ్యతగా ఉండే శంకరన్నపై సొంత పార్టీ నేతలు మాత్రం గుర్రుగా ఉంటారు. అవినీతి ఎక్కడున్నా సహించేది లేదని తనపై దాడి జరిగినా అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం మానుకోనని ఇటీవల తనపై దాడి జరిగిన అనంతరం స్పష్టం చేశారు. ఇలాంటి శంకరరావుకు సొంత పార్టీలో గుర్తింపు ఉందో లేదో కానీ ప్రజల్లో మాత్రం సంచలనాలకు మారుపేరుగా మారారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+