నన్ను కుక్కతో పోల్చినా ఇబ్బంది లేదు: శంకరరావు

తాము మంత్రులుగా ఎంతకాలం ఉంటామో తెలియదని, మంత్రివర్గ మార్పులు చేర్పుల్లో పదవులు పోవచ్చునని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అసలు నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తాను గాంధీ కుటుంబానికి వాచ్ డాగ్‌నని, తనను కుక్కతో పోల్చినా ఇబ్బంది లేదన్నారు.
కాగా శంకర రావు సోమవారం కూడా నేలపై కూర్చొనే మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి కార్యాలయంలో కూర్చీలు లేక పోవడంతో విలేకరులు కింద కూర్చున్నారు. శంకర రావు కూడా వారినే అనుసరించారు. కాగా మూడు రోజుల క్రితం శంకర రావు కింద కూర్చొని అధికారులతో సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications