రంగాను చంపిందెవరో అందరికీ తెలుసు: వంగవీటి రాధా

Vangaveeti Radhakrishna
విజయవాడ: తాను పార్టీ మారాలని అనుకుంటే తనను ఎవరూ ఆపలేరని కృష్ణా జిల్లా సీనియర్ నేత వంగవీటి రాధాకృష్ణ సోమవారం విజయవాడలో అన్నారు. తన తండ్రి వంగవీటి రంగను ఎవరు చంపారో అందరికీ తెలుసునని అన్నారు. వారితో రంగా ఫోటోతో గెలిచిన కొంతమంది లాలూచి పడ్డారని విమర్శించారు. రంగా పేరు చెప్పుకొని ఎదిగిన నేతలు ఇప్పుడు ఆయన పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి నీచ రాజకీయాలకు ప్రజలే గట్టి గుణపాఠం చెబుతారన్నారు.

తాను ఏ పార్టీలో చేరాలనుకున్న చేరడానికి ఎవరూ అడ్డుకారన్నారు. తనను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదన్నారు. తాను బెజవాడలోనే గెలిచి తీరుతానని సవాల్ చేశారు. తనకు ఏ పార్టీలో చేరినా గెలిచే సత్తా ఉందన్నారు. తన రాజకీయ భవిష్యత్తును కార్యకర్తలే నిర్ణయిస్తారని తెలిపారు. కార్యకర్తలతో సమావేశమైన అనంతరం త్వరలో తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+