తెలుగు తమ్ముళ్ల మద్యం గొడవ, కూల్ డ్రింకన్న టిడిపి

West Godavari District
ఏలూరు/విశాఖపట్నం: మద్యంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెలుగు తమ్ముళ్లు చేసిన ఆందోళనలు వివాస్పదంగా మారాయి. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శాసనసభ్యుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో కొందరు కార్యకర్తలు మద్యం సేవించారని టీవీ ఛానళ్లలో కథనాలు వచ్చాయి. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. బాధ్యతాయుతంగా ఉండాల్సిన ప్రతిపక్ష పార్టీ నేతలు నడిరోడ్డుపై మద్యం సేవించడమేమిటని ప్రశ్నించారు. విద్యార్థులకు, కార్యకర్తలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని పలువురు విమర్శించారు.

అయితే టిడిపి మద్యం సేవించిన వార్తలను ఖండించింది. తమ పార్టీ కార్యకర్తలు, నేతలు ఎవరూ మద్యం సేవించలేదని, మద్యం రేట్లను నిరసిస్తూ కేవలం కూల్ డ్రింక్స్ మాత్రమే తాగారని వివరణ ఇచ్చారు. ఏలూరులో బొత్స సత్యనారాయణ కటౌట్ ముందు నిరసన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+