యాత్ర కాదు తెలంగాణపై దండయాత్ర: బాబుపై టిఆర్ఎస్

మోత్కుపల్లి, ఎర్రబెల్లి చంద్రబాబు ఏజెంట్లుగా మారారని విమర్శించారు. వారు బాబుకు కాపలా కుక్కలు అని, వారిని ఇంట్లో పెట్టుకోవాలి కాని ప్రజలలోకి పంపవద్దన్నారు. పదవులు దక్కించుకోవడానికి, పార్టీని కాపాడుకోవడానికే టిడిపి నాటకాలు ఆడుతుందని వారిని ప్రజలు విశ్వసించరన్నారు. తెలంగాణ విద్యార్థుల ఆత్మహత్యలకు నివాళులు అర్పించాలని నాగం మహానాడులో కోరగా బాబు తోసిపుచ్చారని చెప్పారు. అమరవీరుల విషయంలో మోత్కుపల్లి విమర్శలు నీచాతినీచం అన్నారు.
బాబు యాత్ర చేపడుతున్నట్లుగా లేదని కరీంనగర్ జిల్లా ప్రజలపై దండయాత్ర చేస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. బాబుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్ర పెట్టుబడిదారులు అండగా నిలుచొని తెలంగాణపై కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. బాబు తన కాపలా కుక్కలను ఉద్యమంపై ఎక్కుపెడుతున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications