కెసిఆర్ వ్యాఖ్యల వెనుక సొంత అజెండా: శైలజానాథ్

విద్యుత్ ఛార్జీల పెంపు కేవలం ప్రతిపాదన మాత్రమేనని, పేదలకు ఇబ్బందిగా ఉంటే ప్రభుత్వం బాధ్యతగా ఆలోచిస్తుందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన వద్ద విద్యుత్ ఛార్జీలు తక్కువ అన్నారు. అనంతపురం జిల్లాలో సుబ్బరాయసాగర్ నీటి వివాదంపై మాట్లాడుతూ అది ఆధిపత్య పోరు కాదని దాహార్తి పోరన్నారు. అధికారులతో మాట్లాడిన తర్వాత సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. కాగా ఉదయం మాజీ మంత్రి, జిల్లా కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి వర్గం సుబ్బరాయసాగర్ నీటి కోసం తాడిపత్రి రెండో ఆయకట్టు వద్ద ఉన్న ఇసుక బస్తాలను తొలగించిన విషయం తెలిసిందే. జెసి స్వయంగా వచ్చి ఇసుక బస్తాలను తొలగింప చేశారు.












Click it and Unblock the Notifications