శోభానాగిరెడ్డి రాజీనామా, పిఆర్పీది మోసమన్న ఎమ్మెల్యే

రాజీనామా సమర్పించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తాను ఉప ఎన్నికల్లో వైయస్సార్సీ పార్టీ నుండి గెలవాలనుకుంటున్నానని, కనుమరుగైన పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగాలనుకోవడం లేదన్నారు. ఇప్పటికే కాంగ్రెసులో చేరిన వంగా గీతకు విప్ ఇచ్చే హక్కు లేదన్నారు. తనపై అనర్హత వేటు వేస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటానన్నారు. చిరంజీవి తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. కాపు రామచంద్రా రెడ్డి వెనక్కి తగ్గలేదన్నారు. ఉప ఎన్నికల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత బహిర్గతమవుతుందన్నారు. ధైర్యం లేకే తాము చేసిన రాజీనామాలను ఆమోదించడం లేని విమర్శించారు. ప్రజావిశ్వాసం పొందేందుకే రాజీనామా అన్నారు. ఎవరు డ్రామాలు ఆడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications