చంద్రబాబు యాత్ర: కెప్టెన్, హరీష్ గృహనిర్బంధం

సోమవారం ఆయన చేసిన వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. కరీంనగర్‌లో జరిగే బాబు యాత్రను అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలంతా అడ్డుకోవాలన్నారు. ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ఇవి నిజమైతే లక్ష్మీకాంత రావుపై చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. అయితే అంతకుముందే యాత్రలో ఎలాంటి విఘాతం లేకుండా ఉండేందుకు పోలీసులు ఆయనను గృహనిర్బంధం చేశారు. మెదక్ జిల్లాలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును, కరీంనగర్‌లో ఎమ్మెల్సీ నారదాసును గృహ నిర్బంధం చేశారు.












Click it and Unblock the Notifications