నటనలో కమల్ హాసన్‌ను మించాడు: బొత్సపై దాడి

మద్యం విక్రయాల్లో అక్రమాలే లేవని బుకాయిస్తున్న బొత్స ముందు తమ కుటుంబ నేతృత్వంలోని మద్యం షాపుల్లో ఎమ్మార్పీకి అమ్ముతున్నది లేనిదీ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు సెంటర్ ఏర్పాటు ఉత్తిదే అన్నారు. అసలు రాష్ట్రంలో ఎక్కైడైనా ఎమ్మార్పీకి అమ్మితే కదా మిగతా వారిపై ఫిర్యాదు చేసేదన్నారు. ఎమ్మార్పీకి మద్యం విక్రయించాలన్న ప్రభుత్వం ఆదేశాలను నిరసిస్తూ బంద్ పాటించిన మద్యం షాపుల్లో బొత్సవి కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. మిగిలిన ప్రభుత్వ విభాగాల్లో పని చేసినందుకు జీతాలు ఇస్తుంటే ఎక్సైజ్ విభాగంలో మాత్రం పని చేయనందుకు జీతాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications