చిరు ఇక్కడే ఉండాలి: రామచంద్రయ్యకు వద్దు: వీరశివా

ఎమ్మెల్సీలకు పదవి ఇవ్వాల్సి వస్తే సి.రామచంద్రయ్య కంటే కాంగ్రెసులో ఎందరో సీనియర్లు ఉన్నారన్నారు. రామచంద్రయ్యకు పదవి ఇస్తే జిల్లాలో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ఆయన కనీసం కార్పోరేటర్‌ను కూడా గెలిపించుకోలేరన్నారు. చిరంజీవి రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. తామంతా చిరంజీవికి మంచి అభిమానులమన్నారు. పిఆర్పీ ఎమ్మెల్యేలకు అధిష్టానం త్వరలో మంచి అవకాశం కల్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయిస్తారని మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి అన్నారు. సిఎం ఇష్ట ప్రకారమే కెబినెట్ విస్తరణ ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications