వెయిటింగ్ లిస్టులోకే చిరంజీవి!, సి.రామచంద్రయ్యకు నో

అంతే కాకుండా ఎమ్మెల్సీ అయిన రామచంద్రయ్యకు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెసు ఎమ్మెల్సీల నుండి ఇబ్బందులు వచ్చే అవకాశముందని పలువురు నేతలు అనుమానం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఇక ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావుపై జార్ఖండులోని
ధన్‌బాద్‌లో కోల్ మైనింగ్ కేసు ఉందని సమాచారం. ఇరువురిపై పలువురు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో చిరు ప్రతిపాదించిన ఆ ఇద్దరిని కేబినెట్లోకి తీసుకునేందుకు అధిష్టానం విముఖత చూపినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి చిరంజీవి వర్గం మరికొంత కాలం వేచిచూడాల్సిన పరిస్థితి వచ్చింది.












Click it and Unblock the Notifications