మద్యం దుకాణాలపై బొత్స ఎలా చెప్పగలిగారు?: బాబు

లోక్‌పాల్ విషయంలో కాంగ్రెసు పార్టీ రాజ్యసభలో దాదాపు పారిపోయినంద పని చేసిందని బాబు ఎద్దేవా చేశారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య అవినీతిని రూపుమాపడంలో కాంగ్రెసుకు చిత్తశుద్ధి లేదన్నారు. లోక్‌పాల్‌ను కేంద్రం నీరుగార్చి ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసిందన్నారు. లోక్‌పాల్ విషయంలో కేంద్రానికి తాను కూడా లేఖ రాశానన్నారు. ఉగ్రవాదం కంటే అవినీతే ప్రమాదమైందన్నారు. ఎంపీలను కొనుగోలు చేసి మరీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే కాంగ్రెసు ప్రజల పట్ల బాధ్యతను మరిచి పోతుందన్నారు. సమర్థ లోక్‌పాల్ కోసం టిడిపి పోరాడం చేస్తుందన్నారు. అవినీతి విషయంలో కేంద్రం బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.












Click it and Unblock the Notifications