తెలుగుదేశం పార్టీ వరుస అటాక్‌లతో డిఫెన్స్‌లో కెసిఆర్?

ఆ తర్వాత పోలవరం విషయం కాస్త చల్లబడ్డప్పటికీ దానిని వదిలి పెట్టేది లేదని టిడిపి నేతలు అంటున్నారు. తాజాగా మోత్కుపల్లి నర్సింహులు కెసిఆర్ దీక్షను టార్గెట్ చేశారు. కెసిఆర్ దొంగ దీక్ష చేశారని చెబుతూ నిమ్స్ వైద్యులు అందించిన ఆధారాలను మీడియాకు విడుదల చేశారు. దీక్ష సమయంలో ఆయనకు వైద్యులు ఏమేమీ ఇచ్చారో వివరాలు అందులో ఉన్నాయి. అలాంటి దీక్ష ఎవరైనా ఎన్ని రోజులైనా చేయవచ్చునన్నారు. దొంగ దీక్ష చేసి విద్యార్థుల ప్రాణాలను బలిగొన్నాడని విమర్శించారు. విజయనగరం జిల్లాకు చెందిన కెసిఆర్ దొంగ తెలంగాణవాది అని తెలంగాణకు చెందిన తాము అసలైన తెలంగాణవాదులమన్నారు. టిఆర్ఎస్ కూడా వారి వ్యాఖ్యలకు స్పందిస్తోంది. అయితే నిన్న పోలవరం, ఇప్పుడు దీక్షపై చేస్తున్న విమర్శలతో టిఆర్ఎస్ డిఫెన్స్‌లో పడిపోయిందని టిడిపి భావిస్తోంది.












Click it and Unblock the Notifications