గాలి జనార్దన్ రెడ్డి బయటకు వస్తే అంతే: సిబిఐ

Gali Janardhan Reddy
హైదరాబాద్: తన తల్లి వర్ధంతికి హాజరు కావడానికి బెయిల్ ఇవ్వాలని కోరుతూ కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సిబిఐ వ్యతిరేకించింది. బళ్లారిలో తన తల్లి వర్ధంతి కార్యక్రమానికి హాజరు కావడానికి రెండు రోజులు పాటు ఎస్కార్‌తో బెయిల్ కోరుతూ గాలి జనార్దన్ రెడ్డి పెట్టుకున్న పిటిషన్‌పై శుక్రవారం వాదనలు ముగిశాయి. గాలి జనార్దన్ రెడ్డి వాదనలను సిబిఐ తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. గాలి జనార్దన్ రెడ్డి బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సిబిఐ తరఫు న్యాయవాది వాదించారు. గాలి జనార్దన్ రెడ్డి మధ్యంతర బెయిల్ కోసం పెట్టుకున్న ఈ పిటిషన్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టు కొట్టేసింది.

బళ్లారిలో ఇప్పటికే భారీగా గాలి జనార్దన్ రెడ్డి కటౌట్లకు ఏర్పాట్లు చేశారని, వందలాది వాహనాలు సిద్ధం చేస్తున్నారని సిబిఐ వాదించింది. బిజెపి నుంచి బయటకు వచ్చి గాలి జనార్దన్ రెడ్డి అనుచరుడు, మాజీ మంత్రి శ్రీరాములు బళ్లారి రూరల్ శాసనసభా నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. గాలి జనార్దన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత కొత్త పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటానని కూడా ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో తల్లి వర్ధంతి కార్యక్రమానికి గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+