కెసిఆర్‌ సెటిలర్: చంద్రబాబు వ్యూహం పారేనా?

Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సెటిలర్ అనే విషయాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తేవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. కెసిఆర్ తెలంగాణ స్థానికుడు కాదని, విజయనగరం జిల్లాకు చెందినవారని చెప్పడానికి ఆయన బాగానే కసరత్తు చేసినట్లు కనిపిస్తున్నారు. విజయనగరం జిల్లాలోని ఓ గ్రామాన్ని చూపించి ఇదే కెసిఆర్ పూర్వీకుల గ్రామమని, ఓ ఇల్లు చూపించి ఇదే కెసిఆర్ పూర్వీకుల ఇల్లు అని తెలుగుదేశం నాయకులు స్థానికులతో చెప్పించారు. ఆ వార్తలను కెసిఆర్ కుమారుడు, తెరాస శాసనసభ్యుడు కెటి రామారావు ఖండించారు. దాన్నలా ఉంచితే, కెసిఆర్ స్థానికుడు కారని, సెటిలర్ అనే విషయాన్ని ప్రచారంలో పెడితే తెలంగాణ ప్రజలు కెసిఆర్‌ను వ్యతిరేకిస్తారా అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం చంద్రబాబు తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల ఫలితాలు చెప్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

తాజాగా, చంద్రబాబు శనివారం కెసిఆర్ సెటిలర్ అనే విషయాన్ని ప్రముఖంగా చెప్పడానికి ప్రయత్నించారు. కెసిఆర్ సెటిలర్ అయి ఉండి కూడా సెటిలర్లను తరిమికొడతాననడం విడ్డూరమని చంద్రబాబు అన్నారు. మీడియా కమిటీ సమీక్షా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయి. సెటిలర్లను విమర్శించే ముందు తాను ఓ సెటిలర్ అనే విషయాన్ని కెసిఆర్ గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. సెంటిమెంటును అడ్డం పెట్టుకుని కెసిఆర్ చేసిన తప్పులను మనం ప్రశ్నించకపోవడం తప్పు అని ఆయన సమీక్ష చేసుకున్నారు. జగన్ ఓదార్పు యాత్రలో, కెసిఆర్ ఫామ్ హౌస్‌లో ఉన్నారని అంటూ ఇలాంటి వాళ్లా రాజకీయాలు చేసేది అని ఆయన అడిగారు. తెలంగాణకు వ్యతిరేకంగా పార్లమెంటులో ప్లకార్డు ప్రదర్శించిన జగన్ ఇవాళ తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తాననడం విడ్డూరమని ఆయన అన్నారు.

తెరాస పార్లమెంటు సభ్యురాలు విజయశాంతిపై కూడా స్థానిక వివాదం గతంలో చెలరేగింది. ఆమెది తెలంగాణ కాదంటూ అప్పట్లో పెద్ద యెత్తునే వార్తలు వచ్చాయి. అయినా ఆమె తెలంగాణలో పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు కెసిఆర్ స్థానికతను లేదా ప్రాంతీయతను తెలుగుదేశం పార్టీ వివాదంగా మార్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+