వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భవిష్యత్తులో నేతల తలరాతలు ఎలా ఉన్నాయి?

By Srinivas
|
Google Oneindia TeluguNews

chandrababu naidu - ys jagan
హైదరాబాద్: 2014లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కింగ్ మేకర్‌గా మారనున్నారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మధ్యలో కొంతకాలంలో జగన్ వెనుకపడినప్పటికీ ఆ తర్వాత బాగా పుంజుకుంటారంటున్నారు. జగన్ జాతకం కంటే ఆయన సతీమణి భారతి జాతకం మరింత బాగుందంటున్నారు. భారతి జాతకం ప్రకారం చూసినా జగన్‌కు 2014లో మహర్దశ ఉంటుందంటున్నారు. అయితే ఆయన లక్ష్యం మాత్రం నెరవేరే విధంగా మాత్రం ఉండదంటున్నారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్‌కు 2012 మే తర్వాత పదవి వరిస్తుందని చెబుతున్నారు. ఆయనకు వ్యక్తిగతంగా బాగుందని, అయితే ఆయన తనయుడు కెటిఆర్, కవితల పరిస్థితి మాత్రం ఇప్పుడు ఉన్న విధంగానే ఉంటుందంటున్నారు. 2014లోనూ కెసిఆర్‌కు జగన్ వలె బాగానే ఉందంటున్నారు.

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు వ్యక్తిగతంగా బాగుంటుందని, అయితే 2014లో ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మాత్రం తక్కువ అని చెబుతున్నారు. పార్టీ ఇబ్బందులను ఎదుర్కొంటుందని చెబుతున్నారు. బాబు తనయుడు లోకేష్ కుమార్ సమీప భవిష్యత్తులో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని చెబుతున్నారు. సిఎం కిరణ్‌కు వ్యక్తిగతంగా ఈ మూడేళ్లు బాగుందని, అయితే పార్టీ మాత్రం ఒడిదుడుగులలో చిక్కుకుంటుందని చెబుతున్నారు. రానున్న కాలంలో కిరణ్ మరింత బలం పుంజుకుంటారట. చిరంజీవికి 2011 జూలైలో మంచి రోజులు వస్తాయని, అందరికంటే చిరంజీవి జాతకం బాగుంటుందని చెబుతున్నారు. బాలయ్య సినిమా పరంగా మంచి సక్సెస్ రేట్ సాధిస్తారని, అయితే ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశాలు లేవని కేవలం ప్రచార బాధ్యతలకే పరిమితమవుతారని చెబుతున్నారు.

అలాగే రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలు కూడా లేవని చెబుతున్నారు. ఇక దేశ రాజకీయాల్లోకి వెళితే రాహుల్ గాంధీకి 2017 వరకు ప్రధాని అయ్యే యోగ్యం లేదంటున్నారు. ప్రణబ్ ముఖర్జీకి ఆ అవకాశం ఉందని చెబుతున్నారు. 2014లో కాంగ్రెసు కంటే బిజెపికే అధికారంలోకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇక 2011లో వలె రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితి ఉండదని, ఈ ఏడాదంతా ప్రశాంతంగా ఉంటుందని చెబుతున్నారు. జనంలో దేశభక్తి కూడా పెరుగుతుందని చెబుతున్నారు.

English summary
Astrologers said that it is very good to KCR, YS Jagan, Chandrababu and Kiran Kumar Reddy personally in 2011.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X