చిరంజీవి మూడు వారాలు ఆగాలి! 24 తర్వాతే ఛాన్స్

మూడో వారం వరకు శూన్య మాసం ఉంది. శూన్యమాసంలో పదవులు పంపిణీ మంచిది కాదని కాంగ్రెసు నేతలు కొందరు భావిస్తున్నారట. ఇప్పటి వరకు ఆగిన వారు మరో ఇరవై రోజులు ఆగితే బావుంటుందని చెబుతున్నారట. ఈ నేపథ్యంలో ఈ నెల 24 తర్వాతే మంత్రి వర్గ విస్తరణకు అవకాశం దొరుకుతుంది. వచ్చే నెల మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఆ లోగానే చిరు వర్గాన్ని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు మాపు అంటూ వస్తున్న పదవులు శూన్యమాసం పూర్తయ్యాక బడ్జెట్ సమావేశాలలోగానైనా చిరు వర్గాన్ని వరిస్తాయా చూడాలి!












Click it and Unblock the Notifications