జగన్ క్రిమినల్ కుట్ర చేసి రాష్ట్రాన్ని చీట్ చేశాడా?

ఆ దినపత్రిక కథనం ప్రకారమే - జగన్ కంపెనీల్లోకి నిధులను మళ్లించిన పలు కోల్‌కత్తాకు చెందిన కంపెనీల స్థాపన వెనక విజయసాయి రెడ్డి పాత్ర ఉంది. హైదరాబాదులోని ఫిల్మ్ నగర్‌లో నివసించే విజయసాయి రెడ్డి హైదరాబాదుకు, చెన్నైకి మధ్య చక్కర్లు కొడుతూ ఉండేవారు. చెన్నైకి చెందిన కీల్వాన్ టెక్నాలజీస్‌లో జగన్ 13.98 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినట్లు సిబిఐ ఆరోపిస్తోంది. ఈ కేసులో విజయసాయి రెడ్డితో పాటు జగన్‌ను కూడా సిబిఐ నిందితుడిగా చేర్చింది. కీల్వాన్ టెక్నాలజీస్‌లో పలు కంపెనీలను విలీనం చేశారు. డెలాయిట్ అంచనాల మేరకే తాము పెట్టుబడులు పెట్టామని ఇన్వెస్టర్లు సిబిఐకి చెప్పారు.
తన తండ్రి, గుర్తు తెలియని ప్రభుత్వాధికారుల పేరును జగన్ వాడుకున్నారని ఎఫ్ఐఆర్‌లో సిబిఐ చెప్పింది. దీంతో తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి పలువురికి ప్రయోజనాలు చేకూర్చినట్లు ఆరోపించింది. నిమ్మగడ్డ ప్రసాద్, పి. ప్రతాప రెడ్డి, ఎకె దండమూడి, శ్రీనివాస రెడ్డి, ప్రసాద్ వంటి పలువురు వ్యాపారవేత్తల పేర్లను కూడా సిబిఐ ప్రస్తావించింది.












Click it and Unblock the Notifications