కెసిఆర్‌పై రేవంత్ ఫైర్, జగన్ కేసు అరెస్ట్‌లో సిబిఐకి ప్రశ్న

కెసిఆర్, కోదండరామ్‌లకు దమ్ముంటే చంద్రబాబు తెలంగాణ యాత్రను అడ్డుకోవాలని సవాల్ విసిరారు. టిడిపికి వ్యతిరేకంగా ఉద్యమకారులను రెచ్చగొట్టడం వారు మానుకోవాలని హితవు పలికారు. మేం తల్చుకుంటే వారు ఇంట్లోంచి కాలు బయట పెట్టలేరన్నారు. మా అలుసును చేతకానితనంగా తీసుకోవద్దన్నారు. వారి తీరు చూస్తుంటే ప్రభుత్వాన్ని కాపాడేందుకే వారు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. ఉద్యమం ముసుగులో అమాయక విద్యార్థులను బలి చేస్తున్నారన్నారు. సోనియా గాంధీకి ఊడిగం చేయాలని, కాంగ్రెసుకు బానిసలుగా పడి ఉండాలని వారు అనుకుంటే ఉండవచ్చునన్నారు. కానీ టిడిపిని టార్గెట్ చేసుకొని రెచ్చగొట్టవద్దన్నారు.
కల్తీ సారా విషయంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విచారణలో ఏ పార్టీ వారు ఆ సంఘటన వెనుక ఉన్నారో తెలుస్తుందన్నారు. మంత్రులు, అధికార పార్టీ నేతల మామూళ్ల మత్తులో మునిగిపోయారని ఆరోపించారు. మద్యం సిండికేట్లపై చర్యలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి ఎందుకు వెనుకాడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కొత్త డిస్టిలరీలకు అనుమతులు ఇవ్వడంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications