విజయసాయిరెడ్డి వెనుక శక్తి బయటకు రావాలి: విహెచ్

V Hanumanth Rao
మెదక్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు మంగళవారం మరోసారి ధ్వజమెత్తారు. జగన్ ఆస్తుల కేసులో అరెస్టైన విజయ సాయి రెడ్డి సిబిఐ విచారణలో వాస్తవాలు దాచిపెడుతున్నట్లుగా అర్థమవుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సాక్షి దిన పత్రికకు పెట్టుబడులు సేకరించడంలో ఆయనదే కీలక పాత్ర అన్నారు. సర్కారు నుండి లబ్ధి పొందిన పెద్దలు, బినామీ పేర్లతో జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టినట్లుగా కనిపిస్తోందన్నారు. అరెస్టైన విజయ సాయి రెడ్డి వెనుక ఉన్న ప్రబలమైన శక్తి ఎవరో బయటకు రావాలని జగన్‌ను ఉద్దేశించి అన్నారు.

తనకు అధికారం ఇస్తే రాష్ట్రంలో స్వర్ణయుగం తెస్తానంటున్న నాయకుడు దమ్ముంటే బయటకు వచ్చి కేసులను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. కాగా సోమవారం రాత్రి జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డిని సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్టుపై మెదక్ జిల్లా పర్యటనలో ఉన్న వి హనుమంత రావు స్పందించారు. కాగా విజయ సాయి రెడ్డికి మంగళవారం ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను మళ్లీ దిల్ కుషా గెస్టు హౌస్‌కు తీసుకు వెళ్లారు. మధ్యాహ్నం ఆయనను కోర్టులో హాజరు పర్చే అవకాశాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+