కటకటాల వెనక్కి విజయ సాయి, 17 దాకా రిమాండ్

కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఇరు పక్షాలను ఆదేశించారు. విజయసాయి రెడ్డి ఓబిసి డైరెక్టర్‌గా, టిటిడి సభ్యుడిగా ఉన్న విషయాన్ని ఆయన తరఫు న్యాయవాది గుర్తు చేశారు. తన న్యాయవాదితో మాట్లాడడానికి అనుమతి ఇవ్వాలని విజయసాయి రెడ్డి న్యాయమూర్తిని కోరారు. అందుకు న్యాయమూర్తి అనుమతించారు. తనను సిబిఐ కార్యాలయంలోనే ఉంచేందుకు అనుమతివ్వాలని ఆయన అంతకు ముందు కోర్టును కోరారు. అయితే, అందుకు కోర్టు అనుమతి ఇవ్వలేదు. జ్యుడిషియల్ రిమాండ్ విధించిన తర్వాత అందుకు వీలు కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications