ఇంగ్లీష్ దిన పత్రికకు జగన్ లేఖ: యనమల ప్రశ్న

Yanamala Ramakrishnudu
హైదరాబాద్: ఒక ఆంగ్ల దిన పత్రిక తనపై వార్త రాసినప్పుడు తన వివరణ అడగలేదని, పత్రికా విలువలు దిగజారాయని అంటున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తన పత్రిక, ఛానల్‌లో ఇతర పార్టీలు, పత్రికలు, న్యాయవ్యవస్థపై అడ్డగోలుగా వార్తలు రాసినప్పుడు ఎవరినైనా ఎప్పుడైనా వివరణ అడిగారా అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మంగళవారం ప్రశ్నించారు. ఆయన ఇతరుల గురించి రాసినప్పుడు మీడియా విలువలు గుర్తుకు రాలేదా అన్నారు. జగన్ అక్రమ సంపాదన, రాజకీయ వ్యవహార శైలి గురించి ఎవరు ప్రశ్నించినా వారిపై తన మీడియా సంస్థల ద్వారా దాడులకు పాల్పడ్డారని విమర్శించారు.

కాగా తన రాజకీయాలపై వార్తాకథనం ప్రచురించిన ఓ ఆంగ్ల దినపత్రికకు జగన్ రెండు రోజుల క్రితం బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడానికి జగన్ రంగం సిద్ధం చేసుకున్నారంటూ ప్రచురించిన వార్తాకథనాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఆ బహిరంగ లేఖ రాశారు. తన ప్రతిష్టను దెబ్బ తీయడానికి పనిగట్టుకుని ఆ పత్రిక వార్తా కథనాన్ని ప్రచురించిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఓ ఎల్లో సిండికేట్ తన బురద చల్లడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా పని చేస్తోందని అంటూ ఆందులో మీరు కూడా చేరిపోయారా అని ఆయన ఆంగ్ల దిన పత్రికను ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+