ఓరుగల్లులో బాబు 'పోరు': టిఆర్ఎస్ వర్సెస్ టిడిపి

మరోవైపు టిఆర్ఎస్ఎల్పీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ బాబు యాత్ర సందర్భంగా ఈ నెల 6న వరంగల్ జిల్లా బందుకు పిలుపునిస్తున్నట్లు చెప్పారు. బాబు తన స్పష్టమైన వైఖరి చెప్పాకే తెలంగాణలో అడుగు పెట్టాలన్నారు. పత్రికల ప్రకటనలు చూసి తెలంగాణవాదులకు పోలీసులు నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. ఎర్రబెల్లిపై కేసులెందుకు నమోదు చేయరని ప్రశ్నించారు. తెలంగాణ రైతాంగానికి బాబు చేశాడంటున్న టిడిపి నేతలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. తెలంగాణవాదుల గొంతు నొక్కాలని చూస్తే అది ప్రభుత్వ వెర్రితనమే అవుతుందన్నారు. ప్రభుత్వం తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు.
ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోని టిడిపి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందని మరో ఎమ్మెల్యే హరీష్ రావు స్టేషన్ ఘనపూర్‌లో ధ్వజమెత్తారు. ఉప ఎన్నికలు రిఫరెండం కాదన్న సిఎం వ్యాఖ్యలతో తెలంగాణలో కాంగ్రెసు చేతులెత్తేసిందనడానికి నిదర్శనమన్నారు. ఎన్నికల్లో సమైక్యవాదులకు బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెసు, టిడిపి డిపాజిట్ల కోసమే పోటీ పడతాయన్నారు.












Click it and Unblock the Notifications