సిడీల సమరం: కెసిఆర్, చంద్రబాబుల్లో ఎవరెటు?

మోత్కుపల్లి విడుదల చేసిన సీడికి సమాధానం చెప్పడానికి తెరాస నాయకులు వీడియో సీడీని విడుదల చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా చంద్రబాబు ఎలా వ్యవహరించారో, ఎప్పుడు ఎలా మాట్లాడారో ఈ సీడీలో వారు చూపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభలో తీర్మానం పెడితే తాము మద్దతిస్తామని చెప్పిన మాటలను సీడిలో చేర్చి, తన మాటకు విరుద్ధంగా ఎలా మాట్లాడారో ఆ తర్వాత చూపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటనను వ్యతిరేకించడానికి చంద్రబాబు ఎటువంటి మాటలను ముందు పెట్టారో చూపించారు. అర్ధరాత్రి ఓ పెద్ద అంశంపై మంత్రులు, పార్లమెంటు సభ్యులతో మాట్లాడకుండా నిర్ణయం వెలువరించారని, కర్ణాటకకు చెందిన వీరప్ప మొయిలీ, తమిళనాడుకు చెందిన వీరప్ప మొయిలీ కుట్ర చేశారని చంద్రబాబు విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుపై మాట్లాడుతూ ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అంటూ ఎద్దేవా చేసిన మాటలు కూడా ఆ సీడీలో ఉన్నాయి. తెలంగాణకు వ్యతిరేకంగా చంద్రబాబు ఎలా మాట్లాడారో ఆ సీడిలో చూపించడానికి తెరాస నాయకులు ప్రయత్నించారు. అయితే, తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications