విజయశాంతిది తెలంగాణకాదు: నటుడు మురళీ మోహన్

Murali Mohan
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు, మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కాదని ఫిల్మ్ నగర్ సొసైటీ మాజీ కార్యదర్శి మురళీ మోహన్ బుధవారం అన్నారు. విజయ శాంతి తెలంగాణకు చెందిన వారా? అలా ఎవరన్నారని ఆయన ప్రశ్నించారు. సొసైటీని ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సొసైటీలో ప్లాట్ కేటాయించాలని విజయశాంతి తమను అడగలేదని ఆయన అన్నారు. ఆమెది అసలు తెలంగాణ కాదని, తెలంగాణ వారికి ప్లాట్లు కేటాయించలేదన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు.

కాగా ఎంపీ విజయశాంతి ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడుతున్న విషయం తెలిసిందే. తాను వరంగల్ జిల్లాలోని ఏటూరునాగారం పరిధిలో జన్మించానని ఆమె చెబుతుంటారు. కానీ కొందరు ఆమె వాదనను కొట్టి పారేస్తున్నారు. కాగా బుధవారం విజయశాంతి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ తెలంగాణ నేతల పైనా ధ్వజమెత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+