బాబుకేనా, పురంధేశ్వరి మాటేమిటి?: కెసిఆర్‌కు ఎర్రబెల్లి

Errabelli Dayakar Rao
వరంగల్: ఇటీవల తెలంగాణలో పర్యటించిన కేంద్ర సహాయ మంత్రి పురంధేశ్వరి, తులసిరెడ్డిలపై మాట్లాడని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేవలం తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును అడ్డుకోవాలని చూడటమేమిటని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు గురువారం అన్నారు. వరంగల్‌లో బాబు యాత్ర కొనసాగుతుందన్నారు. టిఆర్ఎస్ దాడులకు దిగితే దుమ్ము దులిపేస్తామన్నారు. టిడిపిపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. టిఆర్ఎస్ కావాలనే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందన్నారు. రైతులు, ప్రజలు వద్దంటే తాముఊరుకుంటామని కాని వారు బాబు కోసం ఎదురు చూస్తున్నారన్నారు.

కాంగ్రెసు, టిఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్‌తో తమను అడ్డుకోవాలని చూస్తున్నాయన్నారు. పోలవరం టెండరుతోనే కెసిఆర్ బాగోతం బహిర్గతమైందన్నారు. ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే కెసిఆర్ ఇక్కడ ఏం చేస్తున్నారన్నారు. తెలంగాణ రాకుండా ఉద్యమం కొనసాగాలనేది కెసిఆర్ వ్యూహమన్నారు. కెసిఆర్, కోదండరామ్, హరీష్ రావులకు ఏమైనా జరిగితే తమదే బాధ్యత అని, విద్యార్థులకు ఏమైనా జరిగితే మాత్రం బాధ్యత వారిదేనన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+