కెసిఆర్‌కు జగన్ గులామన్న ఆనం, బాబుకు అండ!

Anam Vivekananda Reddy
హైదరాబాద్/నెల్లూరు: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై జరిగిన రాళ్ల దాడిని కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తీవ్రంగా ఖండించారు. బాబుపై దాడిని తాను ఖండిస్తున్నానని ఆనం అన్నారు. తెలంగాణలో పర్యటించాలంటే టిఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇచ్చే వీసా ఎవరికీ అక్కర్లేదన్నారు. రాజ్యాంగబద్దంగా దేశంలో తిరిగే స్వేచ్ఛ అందరికీ ఉందన్నారు. కెసిఆర్‌కు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గులాంగిరి చేస్తున్నారని విమర్శించారు. తమ పార్టీ అధినేత చంద్రబాబుపై టిఆర్ఎస్ దాడి సరికాదని ఎర్రన్నాయుడు అన్నారు. దమ్ముంటే టిఆర్ఎస్ రైతు సమస్యలపై తమ వైఖరి వెల్లడించాలన్నారు.

చంద్రబాబుపై టిఆర్ఎస్ దాడిని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కూడా ఖండించారు. ప్రజాస్వామ్యంలో చంద్రబాబు యాత్రను అడ్డుకోవడం సరికాదని ఆయన అన్నారు. తెలంగాణపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చేస్తున్న జాప్యానికి తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న మనలో మనం కొట్టుకోవడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రకటనకు కాంగ్రెసు హైకమాండే అసలైన అడ్డు అన్నారు. అందరం కలిసి పోరాడాల్సింది కేంద్రంపై అన్నారు. అయినా తెలంగాణకు ప్రధాన అడ్డంకి ఐన కాంగ్రెసు నేత గులాం నబీ ఆజాద్ హైదరాబాదులో ఉన్నప్పుడు అడ్డుకోని టిఆర్ఎస్ చంద్రబాబును అడ్డుకోవడమేమిటని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+