వైయస్ జగన్‌ను అరెస్టు చేయాల్సిందే: విహెచ్

V Hanumanth Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను అరెస్టు చేయాలని కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు సిబిఐని డిమాండ్ చేశారు. బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేస్తారని ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి బెయిల్‌ను రద్దు చేశారని, వైయస్ జగన్ బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేయరా అని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఈ విషయాన్ని తాను సిబిఐ దృష్టికి తీసుకుని వెళ్తానని ఆయన అన్నారు. సాక్ష్యాలు ఉన్నందున వైయస్ జగన్‌ను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో వైయస్ జగన్‌పై ఎందుకు చర్చించలేదని ఆయన అడిగారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాను విమర్శిస్తే కూడా జగన్‌పై ఎందుకు స్పందించడం లేదని ఆయన అడిగారు. వైయస్ జగన్‌కు తగిన గుణపాఠం చెప్పకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన అన్నారు. సిబిఐ విచారణను ప్రభావితం చేయడానికే జగన్ దీక్షలు చేపడుతున్నారని ఆయన విమర్శించారు. పార్టీ విప్‌‌ను ధిక్కరించిన పార్టీకి చెందిన వైయస్ జగన్ వర్గం శానససభ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+