చంద్రబాబును అరెస్టు చేస్తారా? ఓరుగల్లు యాత్ర టెన్షన్

Chandrababu Naidu
హైదరాబాద్/వరంగల్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వరంగల్ జిల్లాలో బాబు యాత్ర కారణంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. వరంగల్ జిల్లా ఎస్పీ కూడా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జిల్లా పర్యటన రద్దు చేసుకోవాలని లేఖ రాశారు. టిడిపి మాత్రం తమకు అలాంటి లేఖ ఏదీ అందలేదని తెలిపింది. రైతుల కోసం తమ నేత పర్యటిస్తున్నారని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని టిడిపి వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబును అరెస్టు చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారితే ఆయనను ఏ పరిస్థితుల్లోనైనా ఆరెస్టు చేయవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.

కాగా హైదరాబాద్ నుండి ఉదయం బయలుదేరిన చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లు ఉప్పల్, నల్గొండ జిల్లాల్లో ఘన స్వాగతం పలికారు. నల్గొండ జిల్లా యాదగిరి గుట్ట సమీపంలో పలువురు టిఆర్ఎస్ కార్యకర్తలు బాబు కాన్వాయ్‌పై రాళ్లు వేసే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. తనపై రాళ్లు రువ్వేందుకు టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించడంపై బాబు స్పందిస్తూ రైతు కోసం పోరు చేస్తున్న నాపై రాళ్లు రువ్వడం శోచనీయమని, భువనగిరి నిమ్స్ కోసం ఆందోళన చేస్తానని చెప్పారు. వంగపల్లి వద్ద టిఆర్ఎస్ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలిపారు. టిఆర్ఎస్ కార్యకర్తల తీరుపై పలువురు తెలుగు తమ్ముళ్లు తిరగబడ్డారు. కాగా బాబు పర్యటన సందర్భంగా జెఏసి వరంగల్ జిల్లా బందుకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+