హరికృష్ణ అలక వీడారా, బాబు సమావేశానికి హాజరు

శనివారం జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ విస్తృత స్థాయి సమావేశం వంటి విషయాలపై చర్చ జరిగింది. మద్యం సిండికేట్లపై కూడా పోలిట్ బ్యూరో సమావేశంలో చర్చించారు. చంద్రబాబు వరంగల్ జిల్లా పర్యటన విజయవంతం కావడంపై సమావేశం హర్షం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శ్రేణులను పార్టీ శ్రేణులు సమర్థంగా ఎదుర్కున్నాయని చంద్రబాబు సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై కూడా చర్చించారు.












Click it and Unblock the Notifications