బాబును నమ్మం, జగన్‌ను అడ్డుకుంటాం: కోదండరామ్

ఆంధ్రలో బలం పెంచుకోవడానికి చంద్రబాబు తెలంగాణలో పర్యటిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాదని సీమాంధ్రకు చెందిన కోడెల శివప్రసాద రావు వంటి తెలుగుదేశం నాయకులు చెబుతున్నారని, వారు అంత స్పష్టంగా చెబుతుంటే చంద్రబాబు తెలంగాణకు అనుకూలం అనుకోవడానికి ఏమీ లేదని ఆయన అన్నారు. సీమాంధ్ర నాయకులు తెలంగాణలో వ్యక్తిగత పర్యటనలు చేస్తే తమకు అభ్యంతరం లేదని, రాజకీయ యాత్రలు చేస్తే మాత్రం అడ్డుకుంటామని ఆయన చెప్పారు. తెలుగుదేశం తెలంగాణ నాయకులు సీమాంధ్ర నాయకులను పల్లకీలో మోస్తున్నారని, వారిపై ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications