సాక్షిగా సిబిఐ ముందుకు అంబటి, నాలుగోరోజు సాయి

Ambati Rambabu
హైదరాబాద్: ఎమ్మార్ కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆదివారం సిబిఐ అధికారుల ఎదుట హాజరయ్యారు. బిపి ఆచార్య హయాంలో అంబటి రాంబాబు ఎపిఐఐసి చైర్మన్‌గా పని చేశారు. ఈ నేపథ్యంలో ఆయన హయాంలో చోటు చేసుకున్న వివరాలను సిబిఐ సేకరిస్తోంది. 2005 నుండి 2007 వరకు ఆయన చైర్మన్‌గా ఉండగానే ఎమ్మార్‌కు భూకేటాయింపులు జరిగాయన్న అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. జగన్ గ్రూపు సంస్థల్లోకి పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు కూడా విశాఖపట్నం, రంగారెడ్డి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో భూకేటాయింపులు జరిగిన అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. వీటిపై కూడా అంబటిని ప్రశ్నించే అవకాశముంది. కాగా అంబటిని నిందితుడిగా కాకుండా సాక్షిగా ఈ కేసులో విచారిస్తున్నట్లు సమాచారం. ఆయన వాంగ్మూలాన్ని అధికారులు సేకరిస్తున్నారు.

మరోవైపు చంచల్‌గూడ జైలులో ఉన్న జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డిని సిబిఐ అధికారులు నాలుగో రోజు విచారిస్తున్నారు. జైల్లో ఉన్నా ఆయనను అధికారులు దిల్ కుషా అతిథి గృహానికి తరలించారు. న్యాయవాదుల సమక్షంలో ఆయనను అధికారులు విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+