రక్తం తాగే కెసిఆర్‌ను కోర్టుకీడ్చుదాం రండి: మోత్కుపల్లి

ఉప ఎన్నికల కోసమే సంక్రాంతి తర్వాత, ఫిబ్రవరిలో ఉద్యమం, దీక్షలు చేస్తానని కెసిఆర్ ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓట్లు, నోట్లు, సీట్ల కోసమే కెసిఆర్ ప్రయత్నాలు అన్నీ అని విమర్శించారు. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని కెసిఆర్ ఎన్నో ఒప్పందాలు కుదుర్చుకున్నారన్నారు. అమరవీరుల పేరుతో అక్రమ సంపాదనకు రుచి మరిగాడని, విద్యార్థుల రక్తం తాగి కెసిఆర్ ఫామ్ హౌస్‌లో నిషాలో ఉన్నారని విమర్శించారు. అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించిన కెసిఆర్‌ను జైలుకు పంపేదాకా నిద్రపోమన్నారు.












Click it and Unblock the Notifications