మేం 'తెలంగాణ' నుండి తప్పించుకోలేం: ఎంపీ సర్వే

Sarve Satyanarayana
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇచ్చే పరిస్థితి నుండి తప్పించుకోలేదని ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ ఆదివారం అన్నారు. ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2009 ఎన్నికల్లో తెలంగాణ ఇస్తామని చెప్పి కాంగ్రెసు ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వచ్చిందని, 2014 ఎన్నికల్లో రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఎన్నికల్లోకి వెళతామన్నారు. తెలంగాణ ఇవ్వని పక్షంలో ప్రజలు కాంగ్రెసును సహించరన్నారు. ఇస్తామని చెప్పాం ఖచ్చితంగా ఇచ్చి తీరుతామన్నారు. తెలంగాణపై కేంద్రం కూడా ప్రకటన చేసిందన్నారు. ఇతర పార్టీల పేరు చెప్పి తాము తప్పించుకోమన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలన బాగుందన్నారు. ఆయన హయాంలో పార్టీ బలపడుతోందన్నారు.

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు వరంగల్ యాత్రను కొందరు అడ్డుకోవడం సరికాదని టిఆర్ఎస్‌ను ఉద్దేశించి అన్నారు. రేపు నిజామాబాద్ వస్తున్న జగన్‌ను కూడా అడ్డుకోవద్దన్నారు. యాత్రల వల్ల ప్రజలకు, రైతులకు మేరు జరిగితే మంచిదే కదా అన్నారు. అడ్డుకోవడం వల్లనే బాబుకు, జగన్‌కు మరింత పేరు వస్తుందని, అడ్డుకోకుంటే వారికి ప్రాధాన్యతే ఉండదన్నారు. ప్రజలకు ఎవరు సేవ చేసిన స్వాగతిస్తామని, తమ పార్టీ నష్టపోతుందని తాము ఎప్పుడు భావించమన్నారు. ప్రజల సంక్షేమమే తమకు ముఖ్యమన్నారు. సోనియా గాంధీ కాంగ్రెసు అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పుడు రెండు రాష్ట్రాల్లోనే పార్టీ అధికారంలో ఉండేదని ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాల్లో తమ పార్టీయే ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+