వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యమకారులకు ప్రత్యేక జైళ్లు: టిజి వెంకటేష్, కెసిఆర్‌పై ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

TG Venkatesh
అనంతపురం: చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై ఆదివారం మరోసారి ధ్వజమెత్తారు. కెసిఆర్ వెనుక ఉద్యమకారులు లేరని గూండాలు మాత్రమే ఉన్నారని అన్నారు. నిత్యం ప్రజలను రెచ్చగొట్టే విధానంతో కెసిఆర్ ముందుకెళుతున్నారన్నారు. గుడ్లు, రాళ్లు విసిరినంత మాత్రాన తెలంగాణ రాదన్నారు. ఉద్యమాల పేరుతో అరాచకాలు చేస్తున్న వారి కోసం కొత్త జైళ్లు వస్తున్నాయన్నారు. సంఘ విద్రోహశక్తులకు, ఉద్యమకారులకు ప్రత్యేక జైళ్లు అవసరమన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణవాదుల దాడి అవివేకం అన్నారు. బాబు తన హయాంలో తెలంగాణకు అధిక ప్రాధాన్యతమిచ్చి, రాయలసీమకు అన్యాయం చేశారన్నారు. తెలంగాణ ఉద్యమం నీరుగారిందని, కెసిఆర్ ఉచ్చులో యువత పడవద్దని సూచించారు.

లక్ష ఉద్యోగాల ప్రణాళికను అడ్డుకున్న వారు చరిత్రహీనులవుతారని హెచ్చరించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ముగ్గురు శాసనమండలి సభ్యులపై వేటు పడుతుందని చెప్పారు. కాగా ఆంధ్ర ప్రదేశ్ బ్యాడ్మింటన్ అధ్యక్షుడిగా టిజి వెంకటేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన గుంతకల్లులోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో పూజలు చేసి, ఆర్యవైశ్య పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేశారు.

English summary
Minister TG Venkatesh said that seperate jails will come to agitators. He fired at TRS chief K Chandrasekhar Rao for his attitude.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X