సిఎం జయలలితపై వ్యాఖ్యలు: నక్కీరన్ ఆఫీసుపై దాడి

tamilnadu
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ అన్నాడిఎంకె కార్యకర్తలు శనివారం చెన్నైలోని పక్ష పత్రిక నక్కీరన్ కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయంలోకి బలవంతంగా చొచ్చుకు వెళ్లిన కార్యకర్తలు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సుమారు రెండువందల మంది కార్యకర్తలు దాడి చేశారు. లోపలున్న ప్రతులను బయటకు తీసుకు వచ్చి తగులబెట్టారు. కార్యాలయంలో ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. కార్యాలయంపై దాడి చేయడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని మార్కెట్లో ఉన్న నక్కీరన్ ప్రతులను తగులబెట్టారు. అన్నాడిఎంకె పార్టీ కార్యకర్తలు గుంపులుగా వచ్చి కార్యాలయంపై దాడి చేశారని పత్రిక వర్గాలు చెప్పాయి. మాజీ ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత కరుణానిధి ఈ దాడిపై విచారం వ్యక్తం చేశారు.

కాగా ఎంజిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జయలలితను పార్టీలో కీలకమైన ప్రచార కార్యదర్శిగా నియమించడాన్ని పార్టీలోని సీనియర్ నేతలు జీర్ణించుకోలేక అసంతృప్తి వ్యక్తం చేశారని, బ్రాహ్మణవాద వ్యతిరేక పునాదులపై ఏర్పడ్డ ద్రవిడ పార్టీలో బ్రాహ్మణ మహిళను ప్రచార కార్యదర్శి వంటి కీలక పదవి ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారని, అయితే ఎంజిఆర్ వారి వద్ద తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారని ఆ పత్రిక రాసింది. జయలలిత చాందసవాదాలు కలిగిన బ్రాహ్మణ స్త్రీ కాదంటూ ఆయన వారికి చెప్పారు. ఈ విషయంపైనే కార్యకర్తలు దాడి చేశారు. అయితే పత్రిక యాజమాన్యం దానిని సమర్థించుకుంటోంది. మేం జయలలితకు వ్యతిరేకంగా రాయలేదని, చాందసవాదం లేదని చెప్పడం ద్వారా ఆమెకు అనుకూలంగానే కథనం రాసినట్టని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+